Header Banner

కోహ్లి టెస్టు రిటైర్మెంట్ వెనక కారణం అదేనా..? ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా..

  Fri May 16, 2025 21:50        Politics

టీమ్ ఇండియా (Team India) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) ఇటీవల టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి క్రీడాభిమానులను షాక్కు గురిచేసిన విషయం తెలిసిందే. టెస్టుల్లో టీమ్ ఇండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన విరాట్.. సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. అయితే అతడి రిటైర్మెంట్ నిర్ణయం వెనక కారణాలు ఇవేనంటూ పలు మీడియాల్లో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. టెస్టుల్లో తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తామని కోహ్లికి బీసీసీఐ (BCCI) హామీ ఇచ్చిందని.. అలా జరగకపోవడంతోనే అతడు ఆటకు వీడ్కోలు పలికినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ కథనాల ప్రకారం.. కోహ్లికి మరోసారి సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సమయంలోనే ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం.

 

ఇది కూడా చదవండి: రాష్ట్రవ్యాప్తంగా ఏపీటీఎస్ కార్యాలయాలు ఏర్పాటు! ఆ 26 జిల్లాల్లో వారికి ఇక పండగే.!

 

ఆ సిరీస్లో టీమ్ ఇండియా 3-1తో ఓడిపోయిన అనంతరం.. కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ యూటర్న్ తీసుకున్నట్లు.. యువ ఆటగాళ్లకు ఆ బాధ్యతలను అప్పగించే ప్రక్రియను ప్రారంభించినట్లు ఆ కథనాల్లో పేర్కొన్నారు. మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారన్న ఆశతోనే కోహ్లి.. దిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడాడని చెబుతున్నారు. ఆడిలైడ్ టెస్టు తర్వాత కెప్టెన్సీ విషయంలో అతడికి హింట్ ఇచ్చారని.. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయని అతడి సన్నిహితులు చెప్పినట్లు ఆయా కథనాల్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం కోహ్లి.. ఐపీఎల్ (IPL) మిగతా సీజన్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. శనివారం నుంచి కోల్కతా, బెంగళూరు మధ్య మ్యాచ్ తో ఈ సీజన్ పునఃప్రారంభం కానుంది. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆ జట్టు కలను ఈ సారైనా కోహ్లి నెరవేర్చుతాడో చూడాలి.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia